Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పద్మశ్రీ లక్ష్మణ్ మానే
నవతెలంగాణ-ఓయూ
దళిత సాహిత్యం విశ్వవ్యాప్త ఖ్యాతి పొందిందని పద్మశ్రీ లక్ష్మణ్ మానే అన్నారు. హిందీ విభాగం ఓయూ ఆధ్వర్యంలో 'సమకాలీన్ సాహిత్య్ మే హషియే కా స్వర్' అనే అంశంపై ప్రముఖ దళిత సాహిత్యకారులు జయప్రకాష్ కర్థమ్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ప్రొ. విష్ణు సరవదే మాట్లాడుతూ దళిత సాహిత్యాన్ని లోతైన అంశంగా అభివర్ణించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత లక్ష్మణ్ మానే, ప్రముఖ దళిత సాహిత్యకారులు పూణే మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ కట్టడంలో పాల్గొన్న శ్రామికులు మన దళితులే అన్నారు. అగ్రవర్ణాల అణిచివేతల నుంచి నేటి కొంత విముక్తికి బాబాసాహెబ్ అంబేద్కర్ కారణమన్నారు. డాక్టర్ జి.వి రత్నాకర్ అనువదించిన బోయి భీమన్న తెలుగు పుస్తకం 'కాలే గుడిసెలు' హిందీ అనువాదం 'జల్ తీ జోపిడియా' పుస్తకావిష్కరణ చేశారు. డాక్టర్ సురేష్ షెల్కే, మహారాష్ట్ర మాట్లాడుతూ పరిశోధక విద్యార్థులు సామాజిక న్యాయం అంశంపై ఆసక్తి పెంచుకొని పరిశోధనలు చేసి విసతంగా రచనలు చేయాలన్నారు. డాక్టర్ శేషు బాబు మాట్లాడుతూ దళిత సాహిత్యంపై లోతైన పరిశోధనలు జరిగాయంటూ మాట్లాడుతున్న వారు అభివద్ధిలో ఎందుకు వెనుకబాటుతనంలో ఉన్నారో చెప్పాలన్నారు. సెమినార్ ముగింపు కార్యక్రమంలో హిందీ డిపార్ట్మెంట్ ఓయూ హెడ్, బీఓఎస్ అసోసియేట్ ప్రొఫెసర్ మాయాదేవి మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి సెమినార్లో పాల్గొన్న వక్తల సంభాషణను ప్రస్తావిస్తూ ధన్యవాదాలు తెలిపారు. సెమినార్కి విశేష స్పందన లభించడంతో గత కొన్ని రోజుల శ్రమకు ఉపశమనంలాంటిదన్నారు. కార్యక్రమంలో హిందీ విభాగం అధ్యాపకులు, సాహిత్యకరులు, పీహెచ్డీ, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.