Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
గౌతంనగర్ డివిజన్ను ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్టు స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ అన్నారు. మంగళవారం గౌతంనగర్ డివిజన్ సాయినగర్ లోని సాయిబాబా గుడి వెనకాల 63 కేవీ సామర్థ్యం గల రూ.2.5తో ఏర్పాటు చేసిన కొత్త ట్రాన్స్ ఫార్మర్ను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి కార్పొరేటర్ ప్రారంభించి మాట్లాడారు. డివిజన్లోని సీసీ రోడ్లు, డ్రయినేజీ, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్స్, తాగునీరు, తదితర మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా కృషి చేస్తున్నామ న్నారు. డివిజన్లోని స్థానిక నాయకుల దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే తమ దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరి ంచే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏఈ సుధీప్ రెడ్డి, ఏఈ దివ్య జ్యోతి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాము యాదవ్, సాయి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి గణేష్ ముదిరాజ్, కిట్టు, ఎం ప్రసాద్ యాదవ్, బైరు అనిల్ కుమార్, సిద్ధిరాములు, గ్యార ప్రవీణ్ కుమార్, రాజు, నగేష్ గౌడ్, నవీన్ యాదవ్, వెంకట్ పాల్గొన్నారు.