Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఎస్ఎఫ్ఐ ఆర్ట్స్ కాలేజీ నూతన కమిటీ ఎన్నిక మంగళవారం నిర్వహించారు. అధ్యక్షులు ఆనంద్ శర్మ (ఇంగ్లీష్ డిపార్ట్మెంట్), కార్యదర్శి రామాటేంకి శ్రీను (పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్) 21మందితో కమిటీ ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి హాజరై మాట్లాడారు. 'చదువు-పోరాడు' నినాదంతో 1970లో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా విద్యారంగాన్ని రక్షించడంలో విద్యా ఫలాలు అందరికీ దక్కేలా అనునిత్యం పోరాడుతుందన్నారు. దేశంలో కులం, మతం, రంగు, వర్ణ, వివక్షత ప్రాంతం భేదం లేకుండా అందరు విద్యార్థులను కలుపుకొని విద్యా సమస్యలపై పోరాటంచేస్తున్నామన్నారు. యూనివర్సిటీ లపై ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్య వాతావరణం కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో అతిపెద్ద సంఘంగా ఎస్ఎఫ్ఐ 60 లక్షల సభ్యత్వాన్ని నమోదు చేశామని చెప్పారు. నూతన కమిటీ ఆర్ట్స్ కాలేజీలోని లైబ్రరీ, హాస్టల్, మెస్ సమస్యలపై పోరాడాలని నూతన కమిటీకి సూచించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రవి నాయక్ మాట్లాడుతూ విద్య ప్రయివేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడుతూ దేశంలో యూనివర్సిటీలో జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఎస్ఎఫ్ఐ విజయపతాకం ఎగురవేస్తుందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా విద్యార్థి ఎలక్షన్ నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఓయూ ఉపాధ్యక్షులు విజరు నాయక్, కరణ్, అంజి, నాయకులు ఆంజనేయులు, సాయి కిరణ్, సాంబశివ, నవీన్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.