Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓయూ వీసీ ప్రొ.రవీందర్.
నవతెలంగాణ-ఓయూ
24న ఉస్మానియా టక్ష్-2022 కార్యక్రమాన్ని ప్రారంభి స్తున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ పేర్కొ న్నారు. మంగళవారం ఓయూ గెస్ట్ హౌస్‌లోని రిపేకటరీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.ఉస్మానియా టక్ష్ పేరుతో వినూత్న ఉత్సవా లను మార్చి 24 నుండి 26 వరకు మూడు రోజుల నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాధారణ ప్రజలు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులను, పేరెంట్స్‌ను ఓయూకు ఆహ్వానించడానికి టక్ష్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా 24న యూనివర్సిటీ వాతావరణం, ఇక్కడ అందించే కోర్సులు, పరిశోధనా సౌకర్యాలు తదితర అంశాలపై చర్చించే కార్యక్రమం ఉంటుందని, పూర్వ విద్యార్థులను యూనివర్సిటీకి మళ్ళీ దగ్గర చేసేవిధంగా 25న, పూర్వ విద్యార్థులతో ప్రస్తుత యూనివర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లతో ఇంటరాక్షన్ సెషన్లు నిర్వహిస్తున్నట్లు ఈ రెండు రోజులలో ఠాగూర్ ఆడిటోరి యంలో సాయం త్రం 4.00 గంట ల నుండి సాం స్కతిక కార్యక్ర మాలు నిర్వహిం చబడతాయన్నా రు. ముగింపు వేడుకలను మార్చి 26న, ల్యాండ్ స్కేప్ గార్డెన్లో సాయంత్రం 4.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు. ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా జాతీయ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా క్యాంపస్‌లో ప్రయాణానికి ప్రత్యేక బస్సు షటిల్ సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్లు, కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు భద్రత, పార్కింగ్, అగ్నిమాపక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యమాల అడ్డాగా ఉన్న ఓయూను ఉద్యమాల అడ్డాగా తీర్చి దిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. బోదన పరిశోధనకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. పూర్వ విద్యార్థులు అధికంగా ఉన్న యూనివర్సిటీలో ఓయూ ముందుంటుందని వీరిని యూనివర్సిటీ అభివద్ధిలో భాగస్వామ్యం చేస్తూ ఇంటలేచుల్ ఇన్ ఫుట్ కోసం కషి చేస్తున్నామన్నారు. విద్యార్థులను చేతన్యవంతం చేసేం దుకు ప్రతినేల లెక్చర్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి అన్నారు. రానున్న 6 నెలల్లో వివిధ జాతీయ రాష్ట్ర స్థాయి లోని ఫండింగ్ ఏజెన్సీలు సంస్థల ద్వారా ఓయూకు ఊహించినంత నిధులు వస్తాయి ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.పి.లక్ష్మీ నారాయణ, యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం, జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ స్టీవెన్సన్, ఓఎస్డీ రెడ్యానాయక్, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ ప్రొ.బి.రాజేంద్ర నాయక్, ప్రొ.మాధవి,పీఆర్ఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.