Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
కేసీఆర్ పిలుపు మేరకు డాక్టర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ పరిధిలోని రాధిక చౌరస్తాలో డివిజన్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి అధ్యక్షతన వంట గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ మోడీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తొలి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తెరాస రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ , మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ అభివద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని, కేసీఆర్ గారి పనితీరును చూసి ఓర్వలేక అప్రతిష్ఠపాలు చేయాలనే నీచమైన ఆలోచనతో బిజేపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను కావాలనే ఇబ్బందుల పాలు చేయాలని చేస్తుందన్నారు. రైతుల పట్ల సవతి ప్రేమ ను చూపిస్తు పంజాబ్ రైతులకు ఒక న్యాయం తెలంగాణ రైతులకు ఒక న్యాయం చేస్తుందని అన్నారు. తెలంగాణ లో ప%శీ%డిన ప్రతి గింజని కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని స్పష్టం చేశారు ఆలాగే పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బేతాల బాలరాజు, పెద్దాపురం కుమారస్వామి, షేర్ మణెమ్మ, క్యాప శిరీష రెడ్డి,మంజుల రెడ్డి, మల్కా, రామా దేవి, యార్లగడ్డ దుర్గ, సజ్జ రామ తులసి, సత్తన్న బాలమణి, ప్రేమ కుమారి,ప్రమీల, కందుల లక్ష్మీనారాయణ, సుదర్శన్ రెడ్డి, రామచంద్ర గౌడ్ ఏనుగు సీతారాం రెడ్డి కష్ణ రమేష్ చారి నాగేశ్వర్ రెడ్డి,బడేటి చిన్న యాదవ్, బాల నరసింహ సురేంద్ర చారి గోలి శ్రీనివాస్ గడ్డం శ్రీనివాస్ యాకయ్య రాజు రెడ్డి సింగం రాజు గిరి మొగులయ్య నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.