Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ-తుర్కయంజాల్
సహకార బ్యాంకులు రైతుల అభివద్ధి కి దోహదం చేస్తాయని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం తుర్కయంజాల్ రైతు సేవా సహకార సంఘం 46వ సర్వసభ్య సమావేశం తుర్కయాంజల్ మున్సిపాలిటి పరిది మన్నెగూడలోని జేఎంఆర్ ఫంక్షన్ హాల్లో తుర్కయంజాల్ సహకార బ్యాంక్ చైర్మన్ డీసీసీబీ వైస్ చైర్మెన్ కొత్తకుర్మ సత్తయ్య అధ్యక్షతన నిర్వహిం చారు. సహకార సంఘంలో సభ్యులైన రైతులకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పవర్ వీడర్లు, కుట్టిమిషన్లు, వ్యవసాయ పరికరాలను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య మాట్లాడుతూ 2020-21 ఆర్థిక సంవత్స రంలో తుర్కయంజాల్ ఎఫ్ఎస్ సీ ఎస్ రూ.2.89 కోట్ల నికర లాభం ఆర్జించిందని తెలిపారు. 2022-23 అంచనా బడ్జెట్ రూ.4.11కోట్లుగా నిర్ణయించా మన్నారు. రైతులు సకాలంలో రుణాలు చెల్లించాలని. అలాగే యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రమే కొను గోలు చేయాలని సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవం గా తీర్మానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా చైర్మన్ వంగేటి లక్ష్మారెడ్డి, బ్యాంకు వైస్ చైర్మన్ కొత్తరాంరెడ్డి, డైరెక్టర్లు, సామ సంజీవరెడ్డి, కొండ్రు స్వప్న శ్రీనివాస్, జక్క కష్ణారెడ్డి, సామ సత్యనారాయణ రెడ్డి, జక్క రాంరెడ్డి, రాగన్నగూడ మాజీ సర్పంచ్ కందాడ లక్ష్మారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వేముల అమరేందర్ రెడ్డి, నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షులు కందాడ సురేందర్‌రెడ్డి, మున్సిపల్ ఆర్గనైజర్ సెక్రటరీ సామ బాలకష్ణారెడ్డి, బ్యాంకు మేనేజర్ రాందాసు, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.