Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక వ్యతిరేక విధానాలకు వ్యతిరే కంగా ఈ నెల 28, 29 తేదీల్లో ప్రతిపాదించిన రెండు రోజుల అఖిల భారత సమ్మెకు అఖిల పక్ష పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపుతున్నట్లు, సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎమ్ ఎల్, కాంగ్రెస్, తెలంగాణ జన సమితి నేతలు తెలిపారు. దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఆకాంక్షిస్తూ గురువారం ఈసీఐఎల్ లోని నీలం రాజ శేఖర్ రెడ్డి భవన్లో అఖిల పక్ష పార్టీల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా సీపీఎం నేతలు చంద్ర శేఖర్, శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. శంకర్ రావు, సీపీఐ ఎం ఎల్ నేత ప్రవీణ్ లు మాట్లాడుతూ సేవ్ పీపుల్, సేవ్ నేషన్' నినాదంతో పిలుపునిచ్చిన సమ్మెకు సమాజంలోని అన్ని వ తమ మద్దతును అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పిఎఫ్ జమపై వడ్డీ రేటును 8.5 శాతం నుంచి 8.1శానికి తగ్గించి, ఆకస్మికంగా పెట్రోలు, ఎల్పిజి, కిరోసిన్, సిఎన్టి తదితర ధరలు పెంచడం ద్వారా కార్మికవర్గంపై భారం పడిందని అన్నారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయిల్లోని వివిధ కార్మిక, ఉద్యోగ సంఘాలు సమ్మెలో పాల్గొనాలని సమావేశం కోరింది.ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ధర్మేంద్ర, సీపీఎం నేత శ్రీనివాస్,రాకేష్ పాల్గొన్నారు.