Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీిఐటీియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కీసరి నర్సిరెడ్డి
నవతెలంగాణ-ఎల్బీనగర్
కేంద్ర ప్రభుత్వం బల్క్ వినియోగదారులకు పెంచిన 25 రూపాయలు తగ్గించా లని, పెట్రోల్ కేంద్ర డీజిల్ ఎక్సైజ్ డ్యూటీవీ తగ్గించాలని కోరుతూ దిల్సుఖ్నగర్ సిటీ బస్ డిపో ముందు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్ర మం చేపట్టారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా సీిఐటీయూ ఉపాధ్యక్షులు కేసరి నర్సిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాట్ని తగ్గించాలని, అత్యంత ధనవంతులపై సంపద ట్యాక్సు విధించి విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలకు కేటాయించాలి, టూరిస్ట్ పర్మిట్ విధానాన్ని రద్దు చేయాలి, కార్మికులపై వేధింపులను అరికట్టాలి, ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటుపరం చేయరాదు. మౌలిక రంగాల కార్పొరేట్లకు కట్టపెట్టరాదు. జాతీయ నగదీకరణ రద్దు చేయాలి. ఆర్టీసీలపై పన్నుల భారం తగ్గించాలి, టీఎస్ ఆర్టీసీ కార్మికులకు రావలసిన 2 వేతన సవరణను వెంటనే ఇవ్వాలి అన్నారు. ఈనెల 28, 29 సమ్మెను జయప్రదం చేయాలని నినదిస్తూ కార్మిక వర్గం పాల్గొన్నది. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకులు ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గోపాల్, ఎస్‌డబ్ల్యూఎఫ్ ప్రచార కార్యదర్శి పిఆర్ రెడ్డి, సీిఐటీియు జిల్లా ఉపాధ్యక్షులు కేసరి నర్సిరెడ్డి, రాజు సీిహెచ్ మల్లేశం, రవీందర్, యాదయ్య, మోహన్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.