Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4 స్క్రాప్ గోదాములను సీజ్ చేసిన అధికారులు
- 3 గోదాములను త్వరలో ఖాళీ చేయాలని నోటీసులు
- కార్పొరేటర్ బి.సుజాత నాయక్
నవతెలంగాణ - హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలో గల నందనవనం మరియు శ్రీరమణ కాలనీలో స్థానిక కార్పొరేటర్ బాణోత్ సుజాతనాయక్ జీ.హెచ్.ఎం.సీ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్క్రాప్ గోదాములు కాలనీలలో ఉండటం వలన ప్రజల జీవన విధానాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని పలుమార్లు గోదాముల నిర్వాహకులకు తెలిపినా వారు నిర్లక్ష్యంగా ఉన్నారని అన్నారు. సమాచారం ఇచ్చిన కొంతకాలానికి జీహెచ్ఎంసీి అధికారులతో కలిసి 4 స్క్రాప్ గోడౌన్లను పరిశీలించి అధికారులు సీజ్ చేశారని, మిగతా 3 గోదాములను వీలైనంత త్వరలో ఖాళీ చేయాలని అధికారులు వారికి నోటీసులు ఇచ్చారని వారు తెలిపారు. జనావాస ప్రాంతాలలో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున స్క్రాప్ గోదాములను నగరానికి వెలుపలకు తరలించాలని ప్రభుత్వాన్ని కోరామని సుజాత నాయక్ తెలిపారు.కార్పొరేటర్ తో టౌన్ ప్లానింగ్ ఏ.సీ.పీ వీరస్వామి, టిసిఎస్ శ్రీ దేవి, శానిటేషన్ డీఈ వెంకటేష్, వర్క్ ఇన్ స్పెక్టర్ గణేష్, బిజెపి నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, సోమిరెడ్డి తదితరులు ఉన్నారు.