Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్‌మెట్
పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ కమిషనర్‌కు మున్సిపల్ కార్మికులు ఈనెల 28, 29 తేదీలో తలపెట్టిన సార్వత్రిక సమ్మె నోటీసును సీఐటీయు ఆధ్వర్యంలో గురువారం అందజేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు, రాష్ట్రంలోని వివిధ కార్మిక ఉద్యోగ సంఘాలు కలిసి ఈనెల 28, 29 తేదీల్లో తలపెట్టిన సమ్మెకు మద్దతుగా సమ్మె నోటీస్ అందజేసినట్లు కార్మిక సంఘం నాయకులు తెలిపారు. కమిషనర్ అందుబాటులో లేకపోవడంతో మేనేజర్‌కు సమ్మె నోటీస్ అందజేసినట్లు తెలిపారు. సమ్మె నోటీసు అందజేసిన వారిలో సీఐటీయు జిల్లా నాయకులు నరసింహ, కార్మిక నాయకులు స్వరూప, మధు విజయశ్రీ, జమున తదితరులు ఉన్నారు.