Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవికి అభినందనలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శ్రీదేవి భవిష్యత్తులో మరిన్ని అత్యున్నత పదవులను అలంకరించాలని ఉప రవాణా కమిషనర్ డాక్టర్ కె.పాపారావు ఆకాంక్షించారు. హైకోర్టు జస్టిస్‌గా తన సోదరి శ్రీదేవి పదోన్నతి పొందిన సందర్భంగా గురువారం ఆమెను ప్రత్యేకంగా కలిసి పూలబొకే అందించి అభినందనలు తెలిపారు. అనంతరం డీటీసీ పాపారావు మాట్లాడుతూ హైకోర్టు ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా తన సోదరి శ్రీదేవి పదోన్నతి పొందడం తనకు గర్వకారణంగా ఉందన్నారు. వివాహం తర్వాత చదువు కొనసాగించడం నిజంగా అతి క్లిష్టమైన అంశమని, తన సోదరి పెండ్లి తర్వాత భర్త సహకారంతో ఇంటర్‌తోనే చదువు ఆపేయకుండా ఇష్టమైన న్యాయవాది చదువులో పట్టా పొంది, జస్టిస్‌గా తన ప్రతిభతో ఉద్యోగం సంపాదించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఇప్పటివరకు తాను చేపట్టిన పదవులన్నింటికీ వన్నె తెచ్చారని ఆయన గుర్తుచేశారు. ఎంతెత్తుకెదిగినా ఒదిగి వుండె మనస్తత్వం ఆమెదనీ, అంచెలంచెలుగా ఎదుగుతూ, న్యాయానికి కట్టుబడుతూ విలక్షణంగా విధులు నిర్వహిస్తూ, ధర్మానికి ప్రతీకగా నిలస్తున్నారని కొనియాడారు. న్యాయవాద వృత్తిలో ఎనలేని ప్రావీణ్యంతో జ్ఞానసముపార్జన చేస్తూ కీర్తి ప్రతిష్టతలు గడిస్తున్నారన్నారు. కుటుంబానికి బాసటగా ఉంటూనే.. వృత్తికి, కుటుంబానికి సమ న్యాయం చేస్తూ తమ పిల్లలను అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. తాను దైవంగా నమ్మే న్యాయ వృత్తి పట్ల త్రికరణశుద్ధిగా వ్యవహరిస్తూ, నైతిక విలువలను పాటిస్తూ, పని చేసిన ప్రతి చోట అందరి మన్ననలను గైకొనడం గొప్ప విషయమన్నారు. రానున్న రోజుల్లో తన సోదరి మరిన్ని ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు పాపారావు వివరించారు.