Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) సౌత్ కమిటీ డిమాండ్
- పలుచోట్ల పెంపుదలపై నిరసనలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని నిరసిస్తూ సంతోష్‌నగర్ చౌరస్తాలో సీపీఐ(ఎం) హైదరా బాద్ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎన్.సోమయ్య మాట్లాడుతూ యూనిట్‌కు 50 పైసలు పెంచడం దుర్మార్గమైన చర్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాలు వేస్తోందన్నారు. ఈ చార్జీలను ఉపసంహరించుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ప్రజల ఆగ్రహానికి కేసీఆర్ ప్రభుత్వం గురికావాల్సి వస్తుందని చెప్పారు. విద్యుత్ చార్జీలు వెంటనే ఉపసం హరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు పి.నాగేశ్వరరావు, ఎం.బాలునాయక్, ఎం.శ్రవణ్‌కుమార్, అబ్దుల్ లతీఫ్, భరత్, జంగయ్య, లింగయ్య, రఫిక్ పాల్గొన్నారు.
ఆర్కేపురం డివిజన్లో ... సరూర్‌నగర్
పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించు కోవాలని సీపీఐ(ఎం) సరూర్‌నగర్ సర్కిల్ కార్యదర్శి సిహెచ్. వెంకన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆర్కే పురం డివిజన్ ఎన్టీఆర్నగర్ రోడ్లో పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసవరించు కోవాలని అన్నారు. విద్యుత్ రెగ్యులేటరీ సంస్థ విద్యుత్ చార్జీలను గృహ వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, పరిశ్రమలకు యూనిట్ రూపాయి చొప్పున పెంచి విపరీతమైన బారాన్ని వేసిందన్నారు. సీపీఐ(ఎం) సరూర్‌నగర్ సర్కిల్ కార్యదర్శివర్గ సభ్యులు ఎం.గోపి నాయక్ మాట్లాడుతూ.. డిస్కంలు పెట్టిన పెంపుదల ప్రతిపాదనలను రెగ్యులెటరీ కమిషన్ ఏమాత్రం ప్రజల గురించి ఆలోచన చేయకుండా ఉన్నదున్నట్టు ప్రకటించి నట్టు స్పష్టమవుతోందన్నారు. గృహ వినియోగదారులైన 60 లక్షల మందికి ప్రస్తుతం యూనిటకు రూ.1,45 పైసలు కాగా 50 పైసలు పెంచగా అది రూ. 1.95, అంటే 34 శాతం పెంచారని తెలిపారు. ప్రస్తుతమున్న యూనిట్ చార్జీలపై రూపాయి పెంచిందని, ప్రస్తుతం ఉన్న భారానికి 25 నుంచి శాతం పెంపుదల వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు ఎం.వీరయ్య, జంగయ్య, రాజు, పద్మ, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.