Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్బీ
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే మొక్కల పెంపకం, పార్కుల అభివృద్ధిపై గురువారం కూకట్పల్లి జోన్ పరిధిలోని సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, జీహెచ్ఎంసీ యుబీడీ వింగ్ అడిషనల్ కమిషనర్, డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. చెరువుల సుందరీకరణ, మల్టీలెవల్ ప్లాంటేషన్, కాలనీ ప్లాంటేషన్స్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు, డిప్యూటీ డైరెక్టర్ సర్కిల్ మేనేజర్స్ తదితరులు పాల్గొన్నారు.