Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
మారేడ్‌పల్లి బాలికల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గురువారం టీిఆర్‌ఎస్ పార్టీ, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి రాజశేఖరెడ్డి ట్రాక్స్ సంస్థ సహకారంతో బాలికలకు, వారి తండ్రులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల భద్రత కోసం స్వచ్ఛంద సంస్థల సహకారంతో హెల్మెట్లు పంపిణీ చేస్తున్నట్లు మర్రి రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. విద్యార్థుల ప్రాణం ముఖ్యమని హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తన వంతు సహకారం హెల్మెట్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల రక్షణ కోసం హెల్మెట్ల వలన ఎంతో ఆవశ్యకత ఉందని, హెల్మెట్ లేకుండా వాహనాలను నడిపి ఏటా వేల సంఖ్యలో మత్యువాతకు గురవుతున్నారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దష్టిలో ఉంచుకుని స్వచ్ఛంద సంస్థల సహకారంతో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని రాజశేఖర్‌రెడ్డి వివరించారు. విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా విధిగా హెల్మెట్ ధరించాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, నళినీకిరణ్, శ్యామ్‌కుమార్, ఉద్యమకారుడు పెద్దాల నర్సిమయాదవ్, ముప్పిడి మధుకర్, రాజు సింగ్, ప్రవీణ్, రాజుసాగర్, ట్రాక్స్ ఎన్జీఓ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజేష్, ఉదరు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.