Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా నాగారం సెరినిటీ మోడల్ హైస్కూల్లో కీసర మండల వైద్యాధి కారిణి డాక్టర్ సరితారెడ్డి ఆధ్వర్యంలో క్షయవ్యాధి నివారణ పై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ప్రధాన ఆరోగ్య సమస్యలలో ఒకటైన క్షయవ్యాధి నుంచి మానవాళిని కాపాడుకోవటానికి తీసుకోవలసిన జాగ్రత్త లు గురించి వివరించారు. అనంతరం మండల వైద్యాధి కారి, వారి సిబ్బంది గత రెండు సంవత్సరాల కాలంలో చేసిన విశేషమైన సేవలను కొనియాడుతూ పాఠశాల యాజమాన్యం వైద్యసిబ్బందిని ఘనంగా సత్కరించింది. అలాగే 12 సంవత్సరాలు దాటిన విద్యార్థులకు కొవిడ్ ఫస్ట్ డోస్, 15 సంవత్సరాలు దాటిన విద్యార్థులకు సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు బాలత్రిపుర సుందరి, రంగనాయకమ్మ, టి.సరిత, ఎస్.వాణి, శ్రీకాంత్, పాఠశాల కరస్పాండెంట్ నోముల జంగిరెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.