Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
నవతెలంగాణ-ఓయూ
ఉపాధ్యాయులే సమాజనికి మూల స్తంభాల్లాంటి వారని, విద్యా ద్వారానే మానవ వికాసం సాధ్యమవుతుందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీత, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న అన్నారు. గురువారం ఓయూ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో నిర్వహించిన ఓపెన్ డేలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతీయ విద్యా తత్వ శాస్రం గొప్పదని, ప్రపంచానికి మానవ విలువలు పరిచయం చేసింది భారతీయ తాత్విక దార్శనికులేనని అన్నారు. నేటి విద్యార్థులు అధ్యాపకులు బోధించిన విషయాలు అచరణలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివద్ధి చెందినప్పుడే దేశ పురోగతి సాధ్యం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొ.రవీందర్, ప్రిన్సిపాల్ ప్రొ.రవీంద్రనాథ్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీ నారాయణ, అధ్యాపకులు రామకృష్ణ , మణాళిని, ఎన్సీటీఈ సభ్యులు డా.పి.శంకర్, డా.ధర్మతేజ, బేగం, సుజాత, సునీత, లలిత, భాగ్యమ్మ, మధుకర్, కష్ణయ్య, విద్యార్థులు, నాన్‌టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.