Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ పరిధిలో గల నందనవనం జీహెచ్ఎంసీి ఆఫీస్ దగ్గర సీఐటీయు గిరిజన సంఘం కేవీపీఎస్ డివైఎఫ్ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 28 మరియు 29 తేదీలలో జరిగే దేశ వ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ 24000 ఇవ్వాలని, వివిధ రంగాల్లో వివిధ సంస్థల కంపెనీలో పనిచే ేస్తున్న కార్మికులకు ధరలకనుకూలంగా కనీస వేతనాల జీవోలను ప్రభుత్వాలు అమలు చేయలని డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీి ప్రభుత్వం వచ్చాక కార్మిక 44 చట్టాలతో పాటు నాలుగు లేబర్ కోడ్లు ప్రవేశపెట్టారని, వెంటనే వాటిని రద్దు చేయాల న్నారు. గంటలకు పెంచ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడంతో పాటు ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందన్నారు. దేశ వ్యాప్త సమ్మెకు మద్దతుగా పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సాగర్ రింగ్ రోడ్లో నేడు ర్యాలీని జయప్రదం చేయాలని, 29వ తేదీన సర్కిల్ ఆఫీసు ముందు జరిగే ధర్నాకు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కర్షకులను కొరమన్నారు. ఈ కార్యక్రమం లో సీఐటీయూ ఎల్బీనగర్ సర్కిల్ కన్వీనర్ ఆలేటి ఎల్లయ్య, గిరిజన సంఘం. రాష్ట్ర నాయకులు ఆర్ పాండు నాయక్, డీవైఎఫ్ఐ శ్రీనివాస్ కే.వీ.పీ.ఎస్ జిల్లా కమిటీ సభ్యులు. దుర్గారావు, నక్క కష్ణ, సీఐటీయూ నాయకులు కుంటి గొర్ల.రాములు యాదయ్య జీహెచ్ఎంసీ కార్మికులు శ్రీనివాస్, జంగయ్య, సాయి, బుజ్జమ్మ లలిత, మహేశ్వరి, బుచ్చమ్మ, శాంతమ్మ, యాదమ్మ పాల్గొన్నారు.