Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలు దైవ భక్తిని కల్గి ఉండాలి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివద్ధికి ఎంతో కషి చేస్తుం దని అందుకోసం ప్రజలు దైవభక్తి కల్గి ఉండి మానసిక ప్రశాంతతతో జీవిస్తారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ సీవైఆర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీకష్ణ దేవాలయ మందిరంలో ఏర్పాటు చేసిన శ్రీకష్ణ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో మేయర్ పారిజాత నర్సిహ్మరెడ్డితో కలసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్లాది రూపాయలతో దేవాలయాలను అభివద్ధి చేసి ప్రజలకు మానసిక ప్రశాంతతను కల్పించటానికి ఎంతో కషి చేస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల అభివద్ధికి నిరంతరం కషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పోరేషన్ టీిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, స్థానిక కార్పొరేటర్లు రామిడి మాధురి విరకర్ణారెడ్డి, జె.పద్మ ఐలయ్య యాదవ్, సంరెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి, సీవైఆర్ కాలనీ అధ్యక్షులు డి.కష్ణారెడ్డి, కార్యదర్శి నరేందర్ రెడ్డి, దేవాలయ కమిటీ అధ్యక్షులు రంగమోహన్ రావు,మాజీ కాలనీ అధ్యక్షులు ఏనుగు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు తుఫాన్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి,కాలనీ కమిటీ, దేవాలయ కమిటీ సభ్యులు, వివిధ కాలనీల ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.