Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్ధిక రంగాల్లో వాటా సాధన లక్ష్యంగా యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో మే 3న హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున యాదవుల ఆత్మ గౌరవ సభ నిర్వహిస్తున్నామని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర కో-ఆర్డినేటర్ చలకాని వెంకట్ యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు ఆత్మ గౌరవ సభ పోస్టర్‌ను ఆదివారం సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ వర్రే వెంకటేశ్వర్లు యాదవ్, విశ్రాంత న్యాయమూర్తి మన్మోహన్ యాదవ్, యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబూరావ్ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్.లక్ష్మణ్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు. నగరంలోని నాగోల్‌లో గల శుభం కన్వెన్షన్‌లో ఈ సభ జరుగుతుందని తెలిపారు. ఈ సభకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రారు యాదవ్, రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్య సభ సభ్యుడు బి.లింగయ్య యాదవ్, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ప్రొఫెసర్ రవీందర్ యాదవ్‌తో పాటు పలు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పలు రంగాల ప్రముఖులు హాజరవుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో యాదవులు, ఉపకులాల జనాభా 18 శాతం ఉందని గుర్తు చేశారు. తరతరాలుగా వత్తినే నమ్ముకుని సంచార జీవులుగా, అడవి బిడ్డలుగా జీవనం సాగిస్తున్న యాదవులకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో ప్రోత్సాహం కరువైందన్నారు. బడ్జెట్లో యాదవులకు 18 శాతం నిధులు కేటాయించాలని, గొర్రెల స్కీం డబ్బులను దళిత బంధు పథకం మాదిరిగా నేరుగా యాదవుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ, యాదవ విద్యావంతుల వేదిక ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న యాదవ్, ప్రధాన కార్యదర్శి అజరు కుమార్ యాదవ్, కోశాధికారి దారబోయిన శ్రీనివాస్ యాదవ్, దుడిమెట్ల శ్రీనివాస్ యాదవ్, యాదవ మహాసభ జాతీయ యువజన కోఆర్డినేటర్ గొర్ల యశ్వంత్ యాదవ్, ఆర్.ఎన్.గౌతమ్, సాంబశివరావు, బలరామ్ యాదవ్, గాయత్రి యాదవ్, డాక్టర్ రమ్య యాదవ్, పారిజాత యాదవ్ తదితరులు పాల్గొన్నారు.