Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబర్పేట ఎంఎల్ఎ కాలేరు వెంకటేష్
నవతెలంగాణ-అంబర్పేట
వికలాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని అంబర్పేట ఎంఎల్ఎ కాలేరు వెంకటేష్ అన్నారు. గోల్నాక క్యాంప్ కార్యాలయంలో అంబర్పేట నియోజకవర్గ వికలాంగుల సంఘం అధ్యక్షుడు క్రాంతికుమార్, కార్యదర్శి భిక్షపతి, మహిళా ప్రతినిధులు సరితలతో కలిసి వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్రావు ఆదివారం ఎంఎల్ఎ కాలేరును కలిసి వికలాంగుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబర్పేట నియోజకవర్గం పరిధిలో సుమారు 3 వేల మంది నిరుపేద వికలాంగ కుటుంబాలు ఉన్నాయని వారికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపుల్లో 5 శాతం ఇండ్లు కేటాయించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. వికలాంగులకు పింఛన్లు, ట్రై సైకిళ్లను అందించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వికలాంగుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని చెప్పారు.