Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
చింతామణి స్త్రీ పాత్రలో అశేష తెలుగు ప్రేక్షకుల లోకంలో నాడు చెరగని ముద్ర వేసిన బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి నటనలో రంగస్థల దర్శకునిగా విశిష్ట సేవ నాటక రంగానికి చేసారని ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ వోలెటి పర్వతీశం కొనియాడారు. శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదికపై బుర్రా సుబ్రహ్మణ్య కళా పీఠం నిర్వహణలో బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి స్మారక సంగీత పురస్కారం సంగీత విద్యాంసులు ఆచార్య కోమండూరి శేషాద్రి కి ప్రదానోత్సవ సభ జరిగింది. ముఖ్య అతిథిగా డాక్టర్ పర్వతీశం పాల్గొని పురస్కారం బహుకరించి మాట్లాడారు. సుబ్రహ్మణ్య శాస్ట్రీ నాటక రంగంలో సంగీత స్వరకర్త గాను ప్రతిభ కలవారని గుర్తు చేశారు. పురస్కార గ్రహీత శేషాద్రి శాస్త్రీయ సంగీతంలో అపార ప్రావీణ్యులని ప్రశంసించారు. రంగస్థల ప్రముఖుడు దీపికా ప్రసాద్ అధ్యక్షత వహించి శాస్త్రితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇండియన్ ఓవర్సీస్ బాంక్ అధికారి పాండురంగ శర్మ, శాస్త్రి సతీమణి ధన లక్ష్మి కుటుంబ సభ్యులు పాల్గొన్న సభకు సంస్థ అధ్యక్షులు రేవతి రామకష్ణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రపంచ రంగస్థల దినోత్సవం పురస్కరించుకొని రంగస్థల కళాకారులు కష్ణ శాస్త్రి, క్రమదాటి, తదితరులను సత్కరించారు.