Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూర్వ డీజీపీ హెచ్.జె.దొర
నవతెలంగాణ-కల్చరల్
తెలుగు నాటకం కాల క్రమంలోమరుగు పడలేదని సినిమా, టీవీ మరే ఇతర మాధ్యమాలు వచ్చిన తెలుగు నాటకం వర్ధిల్లుతుందని పూర్వ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హెచ్ జె దొర అన్నారు. రవీంద్రభారతిలో ప్రధాన వేదిక రసరంజని నాటక సంస్థ 29 వార్షికోత్సవం ముగింపు సభలో దొర ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలుగు నాటక అభివద్ధి కోసం 29 ఏండ్ల కిందట నాటకఅభిమానులు అందరూ కలిసి స్థాపించుకొన్న రసారంజని నిరాటంకంగా నడవటం ఆనందకరమన్నారు. తెలుగు నాటక పరిషత్ అధ్యక్షులు బొల్లినేని కష్ణయ్య అధ్యక్షత వహించారు. సినీ రచయిత బుర్రా సాయి మాధవ్, సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణ, ప్రభుత్వ సలహాదారు డాక్టరు కేవీ రమణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ రంగ స్థల దినోత్సవం పురస్కారించుకొని యువ రంగస్థల పురస్కారం పాతిక వేల నగడుతో కొండల రెడ్డిని అతిథులు సత్కరించారు. అనంతరం బండారు అచ్చ మాంబ రచించిన 'ధన త్రయోదసి' నాటకం కోట్ల హనుమంతరావు దర్శకత్వంలో ప్రదర్శితమైంది.