Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
రసూల్పుర కేఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్, అమీర్పేట్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ సంయుక్తంగా కంటోన్మెంట్ పికెట్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్కు చెందిన వైద్యులు డాక్టర్ పవన్ రెడ్డి, కార్డియాలజిస్టు, డాక్టర్ మౌనికారెడ్డి, జనరల్ ఫిజిషియన్లతో పాటు ఇతర పారా మెడికల్ సిబ్బంది పాల్గొని సాధారణ వైద్య పరీక్షలు గుండెకు సంబంధించిన ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి వైద్య సూచనలు ఇచ్చారు. డాక్టర్ పవన్ రెడ్డి మాట్లాడుతూ ఏదైనా ఆరోగ్యపరమైన ఇబ్బంది తలెత్తితే స్వంత వైద్యం అని ఆలస్యం చేసుకోకుండా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలని సూచిం చారు. వైద్యుల సలహా మేరకు మందులు తీసుకోవాలి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆస్టర్ ప్రైమ్ వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది జేమ్స్, సంధ్య సింగ్, సందీప్, శ్రీ విజరు చందర్, క్యాంప్ కో-ఆర్డినేటర్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ పాల్గొన్నారు.