Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వనస్థలిపురం
వత్తి రీత్యా తండ్రి ఆర్థోపెడిక్ డాక్టర్.. కూతురు ఆర్కిటెక్ట్ ఇంజినీర్. కానీ ప్రవత్తి రీత్యా ఇద్దరూ రంగస్థల నటులే. ఏ మాత్రం సమయం దొరికినా పద్య నాటకం వేసేస్తారు. వారి అంకితభావం అలాంటిది. పెళ్లీడు వచ్చిన అమ్మాయిలు నాట్యం చేయడానికి జంకుతున్నారు. అలాంటిది వేషం వేసుకొని పద్యనాటకంలో నటించడం..తండ్రీతో పోటీపడి పద్యాలు ఆలపించడం అత్యంత అరుదైన సన్నివేశం. ఈ అరుదైన రంగస్థల కళాకారులను ప్రముఖ సంస్థ ''ఆకతి'' గుర్తించి ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించారు.. ఆదివారం ఉదయం వనస్థలిపురంలో రాజ్యలక్ష్మి హాస్పిటల్లోని సమావేశ మందిరంలో ఆకతి సుధాకర్ నిర్వహణలో ఈ కార్యక్రమం పలువురు పద్య నాటకం కళాకారుల మధ్య ఉల్లాస భరితంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా¸ విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ఆయాచితం శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరైన తండ్రీ, కూతురు డా.శూలపాణిని, రాజన్యలక్ష్మిని దుశ్శాలువాతో, జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది నిజంగా తెలుగు పద్యప్రియులు, నాటక ప్రియులు హర్షించదగ్గ సన్నివేశం అని, మరుగున పడుతున్న నాటకానికి ఇలాంటి కళాకారులు ప్రాణవాయువు లాంటి వారు. వీరి తపన చేస్తుంటే చాలా సంతప్తిగా వుంది అన్నారు. రంగస్థలంపై తండ్రితో పోటీపడి నటిస్తున్న రాజన్యలక్ష్మి చేస్తున్న ఈ సాహసం పట్ల అమ్మాయిలు స్ఫూర్తి పొంది నాటక రంగం పట్ల దష్టి సారించాలి అన్నారు. డిగ్రీ కళాశాల అధ్యాపకులు నాగవాణి మాట్లాడుతూ నాటక రంగం తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంటుంది అన్న ఆశాభావం ఈ తండ్రీ కూతురులను చూస్తే కలుగుతోంది అంటూ కీర్తించారు. కార్యక్రమానికి ఆకతి సుధాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డా.శూలపాని, రాజన్యలక్ష్మి విభిన్న పద్యనాటకాలలోని సన్నివేశాలు ప్రదర్శించి పద్యప్రియులను ఓలలాడించారు. నటులు జి.వెంకటేశ్వర్లు, సీతారామ రాజు తదితరులు పాల్గొన్నారు.