Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- కేపీహెచ్బీలో మోడల్ రైతు బజార్ ప్రారంభం
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
నాగరికత పెరిగేకొద్దీ ప్రజలు సుఖప్రదమైన జీవితాన్ని కోరుకుంటున్నారనీ, సూపర్ మార్కెట్లకు దీటుగా రైతు బజార్, సమీకృత మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడానికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో రూ.15 కోట్లతో నిర్మించిన నూతన రైతు బజార్‌ను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, కార్మికశాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు కె.నవీన్ కుమార్, శంబీపూర్ రాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడు తూ ఆధునిక రైతు బజార్లను అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు దళారుల బాధ లేకుండా, పండించిన కూరగాయలను విక్రయించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంద న్నారు. రైతుల వద్దకు వెళ్లిన మంత్రి వారితో మాట్లాడారు. మహిళా రైతు వద్ద చిక్కుడు కాయలను కొనుగోలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఆసియాలోనే అతి పెద్ద కాలనీ కేపీహెచ్‌బీ అనీ, ఇక్కడ అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఈ రైతు బజార్‌ను ఏర్పాటు చేయడానికి కృషి చేసిన మంత్రి హరీష్ రావుకి కృతజ్ఞతలు తెలుపుతూ అడిగిన వెంటనే నిధులు సమకూర్చిన మంత్రి నిరంజన్ రెడ్డికి ధన్యవా దాలు తెలియజేశారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన రైతులకు అన్ని వసతులతో వారు ఇబ్బంది పడకుండా ఉండేటట్టు విశ్రాంతి గదుల తో సహా ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా అండర్ గ్రౌండ్లో పార్కింగ్తో సహా ఈ రైతు బజార్ నిర్మాణం చేశామనీ, అటు రైతులకు వినియోగదారులకు అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.