Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాసిరకమైన భోజనంపై విద్యార్థుల ఆవేదన
నవతెలంగాణ-ఓయూ
భోజనంలో బొద్దింకలు, పాడైపోయిన భోజనం పెట్టడాన్ని నిరసిస్తూ లేడీస్ హాస్టల్ గర్ల్స్ ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు రాస్తారోకో చేపట్టారు. కొన్ని రోజుల నుంచి ఫుడ్ సరిగ్గాలేదని పలుమార్లు అధికారులకు చెప్పినా గానీ పెడచెవిన పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గత్యంతరం లేక పోవడంతో ఆందోళన చేపట్టామన్నారు. వాటర్, మరుగుదొడ్లు, అనేక సమస్యలు ఉన్నాయని తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. యూనివర్సిటీలో ఇలాంటి పరిస్థితి ఉంటుందని అనుకో లేదని చెప్పారు. డైరైక్టర్ వల్ల ఈ సమస్యలు పరిష్కారం కావని వారు స్పష్టంచేశారు. కనీస వసతులు కల్పించలేని అధికారులు ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు లిమిట్ టిఫిన్, కూరలు ఇవ్వడంతో కొంత ఆకలి బాధలు ఎదుర్కొంటున్నామన్నారు. కార్యక్రమంలో గర్ల్స్కు మద్దతుగా ఎస్ఎఫ్ఐ నేతలు విజరు, రవి నాయక్, కరణ్, అరవింద్, వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు విజరు, నాగరాజు, జీవన్, కార్తిక్, సుధాకర్, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
మద్దతుగా వచ్చిన విద్యార్థుల అరెస్ట్
ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి లేడీస్ హాస్టల్ విద్యార్థులు చేపట్టిన రాస్తారోకో రాత్రి 8 గంటల వరకు చేశారు. చీఫ్ వార్డెన్ డా.కె.శ్రీనివాస్ వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. వీరికి అండగా నిలిచిన ఎస్ఎఫ్ఐ నేత అరవింద్, పీడీఎస్యూ (విజంభణ) రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లూరి విజరు, దుర్గం దిలీప్, సిటీ కన్వీనర్, దేవ్, ఎంఎస్ఎఫ్ నాయకులు నాగరాజు విజరులను పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థినిలను సంఘీభావంగా వెళ్లిన నాయకులను అరెస్ట్ చేయడం పాలకుల నియంతృత్వాన్ని తెలియజేస్తుందని ఆరోపించారు. వెంటనే అరెస్ట్ చేసిన విద్యార్థులను, నాయకు లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమ్మాయిలు ఇలా ఉద్యమిస్తున్న తరుణంలో ఓయూ అధికారులు రహదారిపై విద్యుత్ సరఫరా నిలిపివేయడం శోచనీయం.