Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్
నవతెలంగాణ - ధూల్‌పేట్
తాడ్బన్ ఖాజా పహాడ్ ప్రాంతవాసులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. ఆవాజ్ ఆధ్వర్యంలో బహదూర్‌పుర, తాడ్బన్ ఖాజాపహాడ్ ప్రాంతంలో ఆవాజ్ బందం సర్వే నిర్వహించారు. ఆవాజ్ నగర కార్యదర్శి అబ్దుల్‌సత్తార్, గులాం నసీర్, యూనుస్ బేగం చేసిన సర్వేేలో స్థానికుల సమస్యలు తెలుసుకుని నిర్ఘాంతపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటి కిరాయిలు భారం, ఆదాయాలు లేక, పిల్లలకు చదువు లేక ఆలోచనలతో ఆరోగ్యం దెబ్బ తింటుంది అన్నారు. నీళ్లు రాక, సరైన నీటి సౌకర్యం లేక హాజా పహాడ్ పైకి నీళుమోసుకుని తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. చాలా మందికి రేషన్ కార్డులు లేక, కొందరికి రెండు, మూడు సంవత్సరాల నుంచి పింఛన్ ఆగిపో యిందని నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. వితంతువులు వికలాంగుల పింఛన్ రాలేదని, అకారణంగా పింఛన్ ఆపివేయడంపై మండిపడ్డారు. ప్రభుత్వం తరఫున పేదలకు ఎలాంటి ఆదాయాలు, సహకారం అందకపోవడం స్థానిక లీడర్లు పట్టించుకోక చీకటిలో జీవిస్తున్నారని, రేకుల ఇల్లు ఉన్నందున చిన్నపాటి వర్షానికే అత్యవసర వస్తువులు తడిసి చెడిపోవడంతో బతుకు భారంగా మారిందన్నారు. పెరుగుతున్న ధరలతో సరిపోక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.