Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీర్జాదిగూడ శ్రీకర హాస్పిటల్లో క్యాతలాబ్ యూనిట్ ప్రారంభం
నవతెలంగాణ-బోడుప్పల్
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకర హాస్పిటల్లో క్యాతలాబ్ యూనిట్ ను ప్రారంభించి సాంకేతిక పరిజ్ఞా నంతో కూడిన వైద్యం అందుబాటులోకి తేవడం సంతోషకరమైన విషయమని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారంనాడు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీకర హాస్పిటల్లో క్యాతలాబ్ యూనిట్‌ను ఆయన ముఖ్య అతిథిóగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ శరవేగంగా అభివద్ధి చెందుతున్న పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శ్రీకర లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆసుపత్రి ఏర్పాటు చేయడం
శుభదాయకమన్నారు. ధనార్జనతో కాకుండా సేవాగుణంతో హాస్పిటల్ యాజమాన్యం వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకర హాస్పిటల్ గ్రూప్ ఆఫ్ సీఈవో డాక్టర్ అనిల్ దాడి, డైరెక్టర్ డాక్టర్ రామాసరస్వతి, డిప్యూటీ మేయర్ కె.శివకుమార్‌గౌడ్, కార్పొరేటర్లు ఎంపల్ల అనంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, యుగంధర్ రెడ్డి హాస్పిటల్ వైద్యులు పాల్గొన్నారు.