Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హోంమంత్రి మహమూద్ అలీ
నవతెలంగాణ-బడంగ్పేట్
జల్పల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న కొత్తపేట్ లోని సక్సెస్ స్కూల్‌కు జిమెరిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ పేరుతో అవార్డు దక్కటం అభినందనీయమని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం హైదరాబాద్ ఫంక్షన్లో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌అలీ ముఖ్య అతిథి గా హాజరై సక్సెస్ స్టార్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్, మెంటర్ షుజావుద్దీన్, ఫౌండర్, చైర్‌వుమన్, కరస్పాం డెంట్ అతియా ఫాతిమాను అవార్డు, ప్రశంసా పత్రంతో అందజేేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా విద్యార్థులకు నాణ్యమైన, సాంకేతిక విద్యను అందించేందుకు కషి చేయటం జరిగిందన్నారు. విద్యారంగంలో వినూత్నమైన ప్రభావవంతమైన సహకారాన్ని అందించిన పాఠశాల విద్యకు అత్యుత్తమ సహకారం చేసినందుకు గాను సక్సెస్ స్కూల్‌కు హైదరాబాద్ అవార్డ్ దక్కటం హర్షణీయ మన్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించటం, వారి సేవలు ఆదర్శనీయమని ఆయన ప్రశంసించారు. అనంతరం సావనీర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్ర మంలో డాక్టర్ సాజిద్ అలీ, డైరెక్టర్ జిమ్రిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అతిథులకు అభినందించి ధన్యవాదాలు తెలిపారు. అవార్డు గ్రహీతలను అభినందించారు. అజర్ అలీ ముజాహిద్, ముఖ్తార్ ఫర్దీన్, సయ్యద్ అస్గర్ అలీ, నస్రుల్లా, మొహ్సిన్ తదితరులు పాల్గొన్నారు.