Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ బోర్డు ఐదో వార్డు వాసవీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షులుగా మూడోసారి తేలుకుంట సతీష్ ఘన విజయం సాధించారు. ప్రతిష్ఠాత్మకంగా కాలనీలో జరిగిన ఎన్నికల్లో సతీష్ మూడోసారి గెలుపొందారు. ఈ మేరకు ఆయన సోమవారం అసోసియేషన్ కార్యాలయంలో విలేకరు లతో మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన కాలనీవాసులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈసారి కూడా తాను కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీనిచ్చారు. కొంతమంది కాలనీ ఎన్నికల్లో కూడా రాజకీయ ప్రమేయంతో గెలుపొందాలని చూసి పరువు దిగజార్చుకున్నారని తెలిపారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియ జేశారు. కాలనీ అభివృద్ధికి కృషి చేస్తూ మౌలిక సదుపా యాల కల్పనతోపాటు కాలనీ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముందు ఉంటానని తెలిపారు. కాలనీ ఎన్నికల్లో కూడా కంటోన్మెంట్ సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ జోక్యం చేసుకుని రాజకీయం చేయాలని చూశారన్నారు. రామకృష్ణ రాజకీయం చేసినప్పటికీ తన గెలుపును అడ్డుకోలేక పోయారన్నారు. స్థానిక కాలనీ ప్రజల కోసం తాను ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు తీసుకుని వారికి న్యాయం చేశాననీ, భవిష్యత్లో కూడా ప్రజా సమస్యల పట్ల దృష్టి సారించి అధికారుల చేత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీనిచ్చారు.