Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన రెండు రోజుల పాటు సమ్మెలో భాగంగా మొదటి రోజు సోమవారం సమ్మె చేపట్టారు. జీపీవో, సికింద్రాబాద్ ప్రధాన కార్యాల యం, జంటనగరాల్లోని అన్ని పోస్టల్ కార్యాలయాలు బోసిపోయాయి. ఉత్తరాల బట్వాడా నిలిచిపోయింది. ఈ కార్యక్రమంలో మహ్మద్ సిరాజ్, ప్రసాద్, రెడ్డి, పి.వి.లక్ష్మీ నారాయణ, ఎం.రాధేశ్ కుమార్, చంద్రకాంత్, రమేష్, విజరు కుమార్, ఎం.దాస్, సిరాజ్, ప్రసాద్,రెడ్డి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
మల్కాజిగిరి : మల్కాజిగిరి మండల పరిధిలోని అఖిలపక్షాలు సీపీఐ(ఎం), సీపీఐ, టీడీపీ, ఐద్వా, డీివైఎఫ్‌ఐ, సీఐటీయూ, ఏఐవైఎఫ్, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, సామాజిక సంఘాల ఆధ్వ ర్యంలో మల్కాజిగిరి చౌరస్తాలో ప్రధాని మోడీ పాలన ను నిరసిస్తూ, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్ర మం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మల్కాజిగిరి మండల కార్యదర్శి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోమటి రవి, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు, సీపీఐ నాయకులు అశోక్, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరణం గోపి, ఐద్వా సంఘం మల్కా జిగిరి మండల కార్యదర్శి మంగ, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుంటి లక్ష్మణ్, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు బంగారు నర్సింగ్ రావు, సీపీఐ(ఎం) నాయకులు భాస్కర్, సీపీఐ నాయకులు అశోక్, యాదగిరి, వెంకటరమణ, రాములు, నిరంజన్, టీడీపీ నాయకులు భిక్షపతి గౌడ్, రమేష్, మహేష్, మాల్యాద్రి పాల్గొన్నారు.
కాప్రా : దేేేశ వ్యాప్త కార్మిక సంఘాల పారిశ్రామిక సమ్మె మొదటి రోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నాచారం చౌరస్తా నుంచి ర్యాలీగా వెళ్లి అన్ని పరిశ్రమల వద్ద నినాదాలతో బంద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జి.దామోదర్ రెడ్డి, సీఐటీయూ నేత గణేష్ , హెచ్ఎంఎస్ నేత సోమిరెడ్డి, సత్య ప్రసాద్, ధర్మేంద్ర, ఏఐటీయూసీ నాచారం యూనియన్ ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి, వెంకట్ రెడ్డి, నర్సింహా, భీమ్ సేన్, మారయ్య, సీఐటీయూ నాయకులు శేఖర్‌రెడ్డి, కృష్ణ, ఆర్ఆర్ఎం శ్రీనివాస్‌బాబు, నర్సింగరావు, ఉజ్వల్, హెచ్ఎంఎస్ఈ రవీందర్ రెడ్డి, మహిళా కార్మికులు కవిత, లక్ష్మి, జానకమ్మ, బుజ్జమ్మ, వెంకటమ్మ, భాగ్య, తదితరులు పాల్గొన్నారు.
కాప్రా : ఈసీఐఎల్ చౌరస్తాలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక నాయకులు, ఎస్ఎఫ్ఐ, స్పూర్తి గ్రూప్ సభ్యులు, అభ్యుదయ ఆర్ట్ అకాడమీ నాయకులు, పి.వెంకట్, వి వి రెడ్డి, సీహెచ్వి ప్రసాద్, జి వై రావు, క్రిష్ణ, సోమయ్య చారి, సాయి, హెచ్వీ స్వామి, విల్సన్, శాస్త్రి, మురళి, రవీంద్రనాథ్, రామ్ బ్రహ్మం, తదితరులు పాల్గొన్నారు.
కాప్రా : దేశవ్యాప్త సమ్మె సందర్భంగా అంగన్వాడీ, ఆశా కార్మికులు, సీఐటీయూ కమలానగర్ ఆఫీస్ నుంచి ఈసీఐఎల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహి ంచారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శోభారాణి, నాయకులు బాలమణి, రమాదేవి, సునీత, రేమో, ఆశావర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు హేమలత, జయప్రద, భారతి, సీఐటీయూ జిల్లా నాయకులు ఉన్నికృష్ణన్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కాప్రా : ఈసీఐఎల్‌లో ర్యాలీ, నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి రాథోడ్ సంతోష్, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్య క్షులు పేరాల నరేష్, నాయకులు రవి, శీను, భాస్కర్, శ్రీనివాసులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
బేగంపేట్ : దేశవ్యాపిత సమ్మె సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాణిగంజ్ డిస్టిలరీ రోడ్డులోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద తెలంగాణ టూరిస్ట్ బస్ డిపో, పాన్బజార్ల మీదుగా వాంటే హెరీటల్ సిగల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనం తరం సిగల్ సెంటర్లో జరిగిని సభలో కె.అజయ బాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సనత్‌నగర్ జోన్ కన్వీనర్ అజయ్‌బాబు, సీఐటీయూ నగర నాయకులు జి.నరేష్, ఎండీ.మోయిన్, జోన్ నాయకులు కోఠి, భిక్షపతి, శ్యాంసన్, లక్ష్మణ్, చాంద్ ఖాషా, సత్యనారాయణ, సతీష్, అజీజ్ పాల్గొన్నారు.
కేపిహెచ్బీ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు కార్మిక కోడ్లను రద్దు చేయాలని సీఐటీ యూ మండల కన్వీనర్ కృష్ణానాయక్ డిమాండ్ చేశారు. దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా సోమవారం కూకట్పల్లి మండలంలోని కేపీహెచ్బి కాలనీ రోడ్డు నంబర్ 3 నుంచి మహాత్మా గాంధీ విగ్రహం వరకు సీఐటీయూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శివ ప్రసాద్, ఎన్పీఆర్డి జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి ధర్మారావు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు శివకుమార్, మండల అధ్యక్షులు గోపాల్, చిరంజీవి, నాయకులు భాషా, భోజనాయక్, శ్రీను, కృష్ణ, సోమనాథ్, రాములు తదితరులు పాల్గొన్నారు.