Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎం.బిర్లా సైన్స్ సెంటర్, ప్లానిటోరియం సంచాలకులు కె.జి.కుమార్
- ఉగాది సందర్భంగా వివిధ పోటీలు
నవతెలంగాణ-హైదరాబాద్
పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మక కళలను వెలికితీసి ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్దడానికి జవహర్‌నగర్ బాల భవన్ చేస్తున్న కృషి గొప్పదని బీఎం.బిర్లా సైన్స్ సెంటర్, ప్లానిటోరియం సంచాల కులు కె.జి.కుమార్ కొనియాడారు. ఉగాది పర్వది నాన్ని పురస్కరించుకుని సోమవారం జవహర్‌నగర్ బాల భవన్లో నిర్వహించిన వివిధ అంశాలైన గ్రూప్ డ్యాన్స్, సోలో, యోగా, డ్రాయింగ్ సంగీతం, వ్యాస రచన, వ్యక్తిత్వ పోటీల్లోని విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంకు ముఖ్య అథితిగా హాజరై చిన్నారు లను కె.జి.కుమార్ అభినందించారు. ఈ సందర్భ ంగా 66 మంది విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ బహుమతులతోపాటు మెమొ ంటో, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ పోటీల్లో జంట నగరాల్లోని యూసఫ్‌గూడ, సెయింట్ క్రిస్టోపర్ హై స్కూల్, గోషాఘాట్ హై స్కూల్, లాలాపేట హై స్కూల్, ఆర్బీఎల్ హై స్కూల్, సేంట్ ఆన్స్ హై స్కూల్, బ్రిల్లియంట్ గ్రామర్ హై స్కూల్, తెలంగాణ మోడల్ స్కూల్ పాలమాకుల తదితర పాఠశాలల్లోని చిన్నారులు సందర్శించిన గ్రూప్ డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి. అనంతరం జవహర్‌నగర్ బాల భవన్ సంచాలకులు డాక్టర్ జి.ఉషారాణి మాట్లాడుతూ జవహర్ బాల భవన్ ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దుతూ వారికి జీవనోపాధిని కల్పిస్తుందనీ, అందులో తర్పీదు పొందిన చిన్నారులు నేడు కళాకారులుగా, తబలా టీచర్స్, డ్యాన్స్ టీచర్, మ్యూజిక్ టీచర్స్, డ్రాయింగ్ టీచర్స్‌గా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేస్తూ జీవనోపాధిని పొందుతున్నారని తెలిపారు. చిన్నారులు విద్యతోపాటు సాంస్కృతిక కళల పట్ల ప్రతిభా పాటవాలను పెంపొందించుకోవాలనీ, దీనికి పేరెంట్స్, గురువులు తమ సహకారాన్ని అందిస్తూ మక్కువ చూపిస్తే అది వారి జీవితానికి మలుపుగా భావించాలని తెలిపారు.