Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసనలో ఐద్వా(మహిళ), డీవైఎఫ్ఐ
నవతెలంగాణ-ధూల్‌పేట్
పెంచిన గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, ధరలు వెంటనే తగ్గించాలని ఐద్వా రాష్ట్ర నాయకులు ఇందిరా, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కష్ణ నాయక్ డిమాండ్ చేశారు. పెరిగిన గ్యాస్ రేట్లు తగ్గించాలని భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) సంఘాల హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జంగంమేట్, నాగోల్ బండ, ఫలకనుమా రైల్వేస్టేషన్ రోడ్డు వద్ద నిరసన వ్యక్తం చేశారు. సౌత్ జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యదర్శి లక్ష్మమ్మ, శశికళలతో కలిసి మాట్లాడుతూ కరోనా వచ్చినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద అనేక భారాలు మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీజేపీ ప్రభుత్వ రాక ముందు నాలుగు వందలు రూపాయలు మాత్రమే ఉన్నటువంటి గ్యాస్ ధర ప్రస్తుతం వేయి రూపాయలు పైన పెంచడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు యూనిట్‌కి 50 పైసలు పెంచడం దారుణమని, నిత్యావసర ధరలు సామాన్యులకు అందకుండా పోతున్నాయి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం ప్రజలను అంధకారంలోకి నెట్టివేస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించే ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా, డీవైఎఫ్ఐ సంఘాల నాయకులు కవిత, రామమణి, లక్ష్మి, పద్మ నూర్జహాన్, శారదా, శ్రీను, బలరాం, తదితరులు పాల్గొన్నారు.