Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ (ఎల్ఎల్ఎఫ్) బోయింగ్ అండ్ టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్‌తోపాటు తెలంగాణాలో ఏరోస్పేస్ పరిశ్రమకు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రకటి స్తోంది తెలంగాణాలో అంగవైకల్యానికి గురయిన (పిడబ్ల్యుడిలు) వారి కోసం ప్రత్యేకంగా ఏరోస్పేస్ ఉత్పత్తి రంగంలో మొదటి సారిగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం చేపట్టబడుతున్నది. ఈ కార్యక్రమం స్కిల్ ఇండియా పథకాన్ని ముందుకు తీసుకెళ్లూ ఆసక్తి కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. మూగ, వినికిడి సమస్యలు, ఇతర వైకల్యాలు కలిగిన 18 మంది ట్రెయినీలతో కూడిన మొదటి బంధం తరగతి గదిలో శిక్షణ పొందనున్నారు. శిక్షణ ప్రారంభం కార్యక్రమంలో బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్గుప్త, అదే సంస్థ సప్లరు చెయిన్ డైరెక్టర్ అశ్విన్ భార్గవ, బోయింగ్ ఇండియా చీఫ్ ఆఫ్ స్టాఫ్ ప్రవీణ యజ్ఞంభట్, బోయింగ్ సంస్థ ఇంటర్నేషనల్ సేల్స్ అండ్ స్ట్రాటజిక్ పార్టనర్షిప్స్ వైస్-ప్రెసిడెంట్ మారియా లైన్, టీబీఏఎల్ ఏరోస్ట్రక్చర్స్ అండ్ ఏరో ఇంజిన్స్ హెడ్ మసూద్ హుసేనీ, టీబీఏఎల్ సీఈవో విశాల్ సంఘ్వి తదితరులు పాల్గొన్నారు. బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలీల్ గుప్త మాట్లడుతూ.. బోయింగ్ సంస్థ ఎల్ఎల్ఎఫ్తో, ఇతర భారతీయ భాగస్వాములతో చాలా సన్నిహితంగా పనిచేస్తు న్నదని అన్నారు. స్థానిక ఏరోస్పేస్, రక్షణ రంగం పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ కోసం పనిచేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం ఆత్మనిర్భర్ భారత్ ముందుచూపు దక్పథానికి దారి కల్పిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా విద్యారంగంలో, నైపుణ్య అభివృద్ధి రంగంలో విశేషంగా కషి చేస్తున్నదని తెలిపారు. మరిన్ని వివరాలకు www.learninglinksindia.org సందర్శించవచ్చని సూచించారు.