Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట
అందరి సహకారంతో దశలవారీగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివద్ధి చేస్తానని సర్పంచ్ చందుపట్ల విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మూడు చింతలపల్లి మండలంలోని జగ్గంగూడ గ్రామంలో ఆల్ఫామెడ్ ఫార్మా కంపెనీ వారి సహకారంతో రూ. 1,60,000 అండర్ డ్రయినేజీ నిర్మాణ పనులను ఎంపీపీ హారిక మురళి గౌడ్ తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బుద్ది శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి పద్మ, వార్డు సభ్యులు భూపాల్ రెడ్డి, సాయిబాబు నాయకులు మురళి గౌడ్, శివ, జంగయ్య, కుమార్, ఆల్ఫామెడ్ జనరల్ మేనేజర్ కాశిరెడ్డి, హెచ్ఆర్ నాయుడు, నర్సింహా, బాల్ నర్సింహా తదితరులు పాల్గొన్నారు.