Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
నాలా ముంపు సమస్యను అధిగమించేందుకు పూడికతీత పనులను అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. డివిజన్లోని భారతినగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్ కాలనీ, స్టేషన్ బస్తీల్లో ఏఈ లక్ష్మీ, వర్క్ ఇన్స్పెక్టర్ రామారావుతో కలిసి పర్యటించారు. భారతినగర్‌లో వర్షాకాలంలో ఎదురవుతున్న వరద ముంపును అధిగమించడం కోసం కొనసాగుతున్న నాలా పూడికతీత పనులను పర్యవేక్షించారు. జీహెచ్ఎంసీకి సంబంధించి జరుగుతున్న పనులను పరిశీలించారు. కాలనీ వాసుల నుంచి డ్రయినేజీ లైన్, మంచినీటి, స్ట్రీట్ లైట్లకు సంబంధించిన ఫిర్యాదులను అందుకున్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో మాట్లాడి త్వరలో సమస్యలు పరిష్కరిస్తానని హామీనిచ్చారు. శ్రీనివాస్‌నగర్ కాలనీలో టెంపుల్ లైనులో వేసే నూతన రోడ్డును పరిశీలించారు. కొత్తగా వేసే రోడ్డు ఎత్తుగా ఉండటంతో పక్క లైను రోడ్డు దిగువగా ఉన్నందున వర్షాలు పడితే ఇండ్లల్లోకి వరద నీరు వస్తుందనీ, మామూలు వర్షానికే వరద నీటితో పాటు డ్రయినేజీ నీరు ఇండ్లల్లోకి చేరడంతో అదే నీటిలో నడవాల్సి వస్తుందని కాలనీ వాసులు తెలుపగా.. వర్షపు నీరు అక్కడ ఆగకుండా రోడ్డును లెవల్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, కాలనీ వాసులు అర్వింద్, చందు, తదితరులు పాల్గొన్నారు.