Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరెకటిక అభివద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్
నవతెలంగాణ-అడిక్‌మెట్
ఆరెకటిక అభివద్ధికి రూ.500 కోట్లతో ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని ఆరెకటిక అభివద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఆరెకటిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కష్ణయ్య, ఆరెకటిక రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ హాజరై మాట్లాడుతూ ఆరెకటికలకు బడ్జెట్ కేటాయించకుండా తమ జాతిని పట్టించుకోకపోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. 'మాంసం- సారావత్తి తమ జన్మహక్కు. తమకు మద్యం షాపుల్లో 30 శాతం రిజర్వేషన్ కల్పించాలి. ఏమాత్రం వత్తికి సంబంధం లేని గౌడ్‌కు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించి తమ పొట్టగొట్టారు.'అని ఆవేదన వ్యక్తంచేశారు. ఆరెకటికలకు బీసీ-డి నుంచి బీసీ-ఏ హోదా కల్పిస్తూ వెంటనే ప్రభుత్వం జీఓ తీసుకురావాలన్నారు. చట్టసభల్లో ఆరె కటిక మహిళలకు ప్రత్యేక నామినేటెడ్ పోస్టులు రిజర్వేషన్ కోటా కల్పించాలన్నారు. ప్రభుత్వం మటన్ వత్తి చేసే ఆరె కటికటలకు 90% సబ్సిడీతో బ్యాంకు ఋణ సదుపాయం ఏ షరతులు లేకుండా ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఆరెకటికల సహజ మరణానికి రూజ6 లక్షల ఎక్స్ గ్రేషియో, 12 వీడీసీ విధానాన్ని రద్దుచేస్తూ జీఓ తేవాలని కోరారు. ధర్నాలో ఆరెకటిక అభివద్ధి సంఘం ప్రధాన కార్యదర్శి నందీశ్వర్, ఉపాధ్యక్షులు నాగ శేషు, రాష్ట్ర యువ నాయకులు నగేష్, తదితరులు పాల్గొన్నారు.