Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాసి రకమైన భోజనం, కనీస వసతులపై విద్యార్థుల ఆవేదన
- అధికారులతో వాగ్వాదం
- వారం రోజుల్లో పరిష్కారం : రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీనారాయణ
- నవతెలంగాణ కథనం ముమ్మాటికీ వాస్తవం...గర్ల్స్
నవతెలంగాణ-ఓయూ
లేడీస్ హాస్టల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారుల తీరును నిరసిస్తూ లేడీస్ హాస్టల్ గర్ల్స్ సోమవారం రాస్తారోకో నిర్వహించారు. గత కొన్ని రోజుల నుండి ఫుడ్ సరిగ్గా లేదని, సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు చెప్పినాగానీ పెడచెవిన పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మజ్జిక, సాంబార్ నీరు నీరుగా ఉంటుందని, లిమిట్ టిఫిన్, కూరలు ఇవ్వడం సమంజసం కాదన్నారు. ఇక గత్యంతరం లేకపోవడంతో ఆందోళన చేపట్టామన్నారు. అన్ని బ్లాక్‌లలో వాటర్ 24గంటల ఇవ్వాలని, మరుగు దొడ్లు సరిపడా ఏర్పాటు చేసి వాటిని నిత్యం
శుభ్రపరచాలని, వాష్ రూమ్స్‌ను డోర్స్ మరియు బోల్ట్స్ ఏర్పాటు చేయాలని, పలు బ్లాక్స్లలో స్టడీ హాల్స్ ఏర్పాటు చేయాలని, వర్కర్స్ సంఖ్య పెంచాలని, వారు విద్యార్థుల పట్ల ప్రవర్తించే తీరు బాగాలేదన్నారు. విద్యార్థుల సంఖ్యకు సరిపడ బెడ్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇక డెరైక్టర్ ఎన్నడూ మా సమస్యలు కనీసం వినదు, మరియు బ్లాక్స్లలో పర్యవేక్షణ చేసిన రోజు లేదని చెప్పారు. రూమ్స్ లో కిటికీలు రిపేరు చేయాలని కోరారు. మరొక వైపు అక్కడ వచ్చిన రిజిస్ట్రార్, ఓఎస్డీలపై విద్యార్థులు విరుచుకుపడ్డారు. దీనితో రిజిస్ట్రార్, ఓఎస్డీలు లేడీస్ హాస్టల్లో వసతులు పరిశీలించారు. ఈ సాయంత్రం నుండి నాణ్యమైన భోజనం వడ్డ్డిస్తాం అని, 10 రోజుల్లో అన్ని సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని, వర్కర్స్ సంఖ్య పెంచుతామని రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొ.రెడ్యా నాయక్‌లు హామీ ఇచ్చారు. సరిగ్గాపని చేయని వారికి మెమోలు జారీచేసి చర్యలు తీసుకోవటానికి వెనుకాడం అని హెచ్చరించారు. విద్యార్థులు అధికారు లను లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని కోరారు. వీరికి పలువురు విద్యార్థి సంఘాల ప్రతినిధులు మద్దతుగా నిలిచారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు రాస్తారోకో చెప్పట్టారు. కార్యక్రమంలో భారీగా గర్ల్స్ పాల్గొన్నారు. చీఫ్ వార్డెన్ డా.కె.శ్రీనివాస రావు, లేడీస్ హాస్టల్ డెరైక్టర్ డా.పద్మ, ప్రొ.గోపాల్ నాయక్, ఈఈ నాగరాజు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఇక నవతెలంగాణ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన
'' కొన్ని రోజుల ఎడ్జెస్ట్ కండి '' కథనంలో ప్రచురించిన అన్ని అంశాలు ముమ్మాటికీ వాస్తవమే అని గర్ల్స్ అక్కడ చర్చించుకున్నారు. ఇది ఇలా ఉండగా కొందరు ప్రధాన అడ్మినిస్ట్రేషన్ ఉన్న వారు గర్ల్స్ ఉద్యమం వెనుక ఎవరు ఉన్నారు అని, గిట్టని వారే ఇలా చేయిస్తున్నారని చర్చించు కోవడం గమనార్హం.