Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్
నవతెలంగాణ-అడిక్మెట్
మహనీయులను స్మరించుకోవడం తమ జన్మహక్కు అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం విద్యా నగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో మహనీయుల జయంతి ఉత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమానత్వ సాధన కోసం కషి చేసిన అంబేద్కర్, పూలే, కాన్షీరాం, బాబు జగ్జీవన్ రావు లాంటి మహనీయులను వల్లే మనం సమాజంలో భాగస్వాములై విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ హక్కులు సాధిస్తున్నామని చెప్పారు. మాదిగ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా బాబు జగ్జీవన్ రావు జయంతి ఏప్రిల్ 5న అన్నదానం, ఏప్రిల్ 11 పూలే జయంతి నాడు 2కె రన్, అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న మహా ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. దళితులు,బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే కాకుండా అగ్ర వర్ణల్లో పేదలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహనీయుల జయంతి ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొల్లూరి వెంకట్, రాష్ట్ర కో ఆర్డినేటర్ చింతం తిరుపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ వరిగడ్డి చందు, ఉపాధ్యక్షులు శ్యాగంటి రాజేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమలేశ, శ్రీకాంత్, హైదరాబాద్ అధ్యక్షులు కానుగంటి సురేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంపటి శ్రీకాంత్, ఓయూ అధ్యక్షులు ఎల్.నాగరాజు, ఓయూ వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్, కార్యదర్శి రఘు, నాయకులు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.