Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి
- ముగిసిన ఎన్ఎస్ఎస్ శిక్షణ తరగతులు
నవతెలంగాణ-ఓయూ
విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల అభివద్ధిలో ముఖ్యభూమిక పోషించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి అన్నారు. శిక్షణ తరగతులు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. ఓయూ జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో కేంద్ర క్రీడలు యూత్ మంత్రిత్వ శాఖ వారి సహకారంతో ఎంపనల్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఈటీఐ)పై గత వారం రోజులుగా ఇస్తున్న శిక్షణ తరగతులు సోమవారం సాయంత్రం ముగిశాయి. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ గ్రామీణ ప్రాంతాలను భూమికగా తీసుకొని సేవలు అందించాలని సూచించారు. ఓయూ ఓఎస్డీ ప్రొ. రెడ్యా నాయక్ మాట్లాడుతూ ఓయూ ఎన్ఎస్ఎస్కు ఉన్న ప్రోగ్రాం ఆఫీసర్స్, వాలంటీర్స్ ఏ యూనివర్సిటీకి లేరు అని అన్నారు. గ్రామాల్లో, నగరాల్లో, స్ల్లమ్స్లో స్థానికులకు అవసరమైన సేవా కార్యక్రమాలు చేసి వారిలో అవగాహన చేస్తూ ముందుకు పోవాలని కోరారు. విద్యార్థుల్లో సామాజిక స్పృహతో పాటుగా సేవా నిరాతి అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఓయూ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ ప్రొ. సవిన్ సౌడ మాట్లాడుతూ వారం రోజులపాటు వివిధ అంశాలపై నిపుణులతో ప్రోగ్రామ్ ఆఫీసర్స్ శిక్షణ అందజేశామని చెప్పారు. శిక్షణ తరగతులు విజయవంతం చేసిన వారికి కతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఓయూ సీఐఎస్ డైరెక్టర్ ప్రొ. కొండ నాగేశ్వరరావు, ప్రోగ్రాం ఆఫీసర్స్ పాల్గొన్నారు.