Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగారెడ్డి జిల్లా సీిఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎం.చంద్రమోహన్
నవతెలంగాణ-ఎల్బీనగర్
దేశంలోని బీజేపీ ప్రభుత్వం విధ్వంసకర విధానాలు అమలు చేస్తుందని రంగారెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎం.చంద్రమోహన్ అన్నారు. మంగళ వారం సరూర్నగర్, ఎల్బీనగర్, హయత్నగర్ మూడు సర్కిల్లో ఆధ్వర్యంలో ఈ నిరసన జీహెచ్ ఎంసీ కార్యాలయం ముందు నిరసన చేయడం జరిగింది. ఈ నిరసనకు అధ్యక్షత సరూర్నగర్ సర్కిల్ సీిఐటీయూ కన్వీనర్ మల్లెపాక వీరయ్య వహించగా, ముఖ్యఅతిథిగా సీిఐటీయూ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్ హాజరై మాట్లాడుతూ నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం బరితెగించి పరిపాలన చేస్తుంది. మాటల్లో జాతీయత, దేశభక్తి గురించి కబుర్లు చెబుతూ, ఆచరణలో దేశ విధ్యంసకర విధానాలను అమలు చేసింది. జాతీయ సహజవనరులు, ప్రభుత్వ రంగం స్థలాలను కారుచౌకగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు అమ్మేస్తున్నది. గత రెండేళ్లుగా కోవిడ్ సంక్షోభంతో కార్మికులు, సామాన్య ప్రజలు బతుకులు అతలాకుతలమైనా, వారిని ఆదుకునేందుకు సిద్ధ పడక అమానుషంగా వ్యవహరించింది. డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, పార్లమెంటులో తనకు మందబలంతో కార్మిక, రైతాంగ వ్యతిరేక చట్టాలను నిరంకుశంగా ఆమోదించుకుంది. ప్రభుత్వ విధానా లను వ్యతిరేకిస్తూ జరుగుతున్న కార్మిక ,ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకంగా నిరసన చేయడం జరుగుతుంది .అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీియూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కీసరి నర్సిరెడ్డి, ఆలేటి ఎల్లయ్య, వెంకన్న, జి.మనోహర్, గోపీనాయక్, జంగయ్య, రాజు లక్ష్మణ్, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.