Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
ప్రతి విద్యార్థినీ విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించి సమాజానికి మెరుగైన సేవలు అందించాలని ప్రముఖ పాత్రికేయుడు, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారులు రామచంద్రమూర్తి అన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని వెంకటాపూర్ అనురాగ్ యూనివర్సిటీలో మంగళవారం సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సీడీఎస్ అనురాగ్ యూనివర్సిటీతో ఎంటర్ ప్రిన్యూర్షిఫ్ డెవలప్మెంట్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థుల్లో సామాజిక విలువలను పెంపొందించడంలో విశ్వవిద్యాలయాలు అద్భుతాలు చేయగలవని అన్నారు ఉత్తమమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని, అప్పుడే మనం కన్న కలలు సహకారం అవుతాయని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయాలు సమాజాభివద్ధికి సామాజిక సహతో కలిగిన నిపుణులను సష్టించాలని కోరారు. సమాజం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యాసంస్థలు ప్రాథమిక పరిశోధనలు చెయ్యాలని అన్నారు. అనంతరం అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యంతో సీడీి ఎస్ చైర్మెన్ మల్లెపల్లి లక్ష్మయ్య ఎంటర్ ప్రిన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇరువురి మధ్య ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అనురాగ్ యూనివర్సిటీ సీఈఓ నీలిమ వైస్‌ఛాన్స్‌లర్ రామచంద్రం, రిజిస్ట్రార్ సైతా సమీస్ ఫాతిమా, ఏయూ డీన్ ఉట్ల బాలాజీ, హెచ్ఓడిలు విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.