Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డివిజన్ ఉపాధ్యక్షుడు ఎండి జాహిద్
నవతెలంగాణ-సరూర్నగర్
ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాలని ఆర్.కె.పురం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎండి జాహిద్ అన్నారు. మంగళవారం డివిజన్లోని రాయల్ హాస్పిటల్లో తలసేమియా బాధితుల కోసం ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా హాజరై రక్త దానం చేసిన వారికి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ కారణంగా రక్త నిల్వలు తగ్గిపోయాయని, ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని కోరారు. రక్త దానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని, అపోహలు నమ్మకుండా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి రహీం, ఎండి షబీర్, అఫ్జల్, అమీర్, శివరాజ్ ,ఇంతియాజ్, బద్రిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.