Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలక్షన్ కమిషనర్ సి. పార్థసారథి
నవతెలంగాణ-కల్చరల్
చారిత్రక వారసత్వ సంపదకు, సాంస్కతిక వారసత్వానికి తెలంగాణ ప్రతీక అని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సి. పార్థసారథి అన్నారు. కల్చరల్ టీవీ, మన టీవీ అంతర్గాల వేదికగా న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన ఉగాది, శ్రీరామనవమి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ మట్టిని తాకితే మానవత పరిమళిస్తుందని, రాళ్లను తాకితే రాగాలు పలుకుతాయన్నారు. మనిషిని తాకితే పోరాట పటిమ కనిపిస్తుందని అలాంటి వారసత్వానికి ప్రతీకలైన తెలంగాణ బిడ్డలు అమెరికాలో కూడా మూలాలు మరువకుండా సాంస్కతిక వారసత్వాన్ని కొనసాగించడం అభినందనీయం అని అన్నారు. తెలంగాణ బహుజన కళారూపమైన ఒగ్గు కథను ప్రదర్శించడం పట్ల నైటా ప్రతినిధులను అభినందించారు. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వేంకటేశం మాట్లాడుతూ మన గొప్ప ఇతిహాసం అయిన రామాయణం నైతిక విలువలను మన భావి పౌరులకు అందించాలని అన్నారు. రామాయణంలోని ప్రతి పాత్ర ఒక మౌలిక విలువకు ప్రతిరూపమని అన్నారు. పోటీ ప్రపంచంలో మొదటి మెట్టున ఉన్న న్యూయార్క్ నగరంలో తెలంగాణా వారసత్వ వాసనలు విరజిమ్ముతున్న నైటా బందానికి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. నైటా అద్యక్షుడు రవీందర్ కంటం మాట్లాడుతూ విదేశాలలో ఉన్న చాలామంది తమ ప్రాంత ప్రశస్తి, తమసంస్కతి పట్ల ఎంతో ఆసక్తితో ఉన్నప్పటికి ఈ రంగుల ప్రపంచలో మన వారసత్వ సంపద కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని అందుకే తెలంగాణాలోని వివిధ కళారూపాలను అమెరికా వాసులకు గుర్తుకు తేవాలని కార్యక్రమాల రూపొందిస్తున్నామన్నారు. కేవలం సాంస్కతిక కార్యక్రమాలే కాకుండా పలు సామాజిక కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో నైటా బోర్డ్ డైరెక్టర్లు, అడ్వయిజర్లు, డోనార్లు, ఎగ్జిక్యూటివ్ టీంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గీత కంకణాల, గీత సింగిరికొండతో పాటు పాలుపంచుకున్న అందరూ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా ప్రదర్శించిన ఒగ్గుకథ, శ్రీరామనవమి ప్రత్యేక పాటలు, ప్రఖ్యాత స్టాండప్ కామెడియన్ శ్యామ హారిని ప్రత్యేక హాస్య కదంబం, జీ సరిగమప ఫేంలు సమర్పించిన సంగీత విభావరి, సురేఖామూర్తి పాడిన లతామంగేష్కర్ గీతాలు ఆహుతులను ఎంతో ఆకట్టుకున్నాయి.