Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
నీటిని ఇంట్లో ఇష్టానుసారంగా వధా చేయకుండా పొదుపు చేయడానికి అలవాటు చేసుకోవాలని డివిజన్-3 లంగర్ హౌస్ జలమండలి మేనేజర్ సందీప్ అన్నారు. లంగర్ హౌస్ జలమండలి అధికారులతో కలిసి యాక్షన్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటీ (ఏఆర్డిఎస్) ఎన్జీవోస్ ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవం పురస్కరించుకొని లంగర్ హౌస్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నీటి పొదుపు పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లల్లో, బాత్ రూమ్‌లలో నీటిని వథా చేయకుండా నీటి నల్లాలను గట్టిగా బిగించుకోవాలన్నారు. నేటి పొదుపుతో రేపటి తరానికి భవిష్యత్తు ఉంటుందన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ లక్ష్మి, ఉపాధ్యాయులు ప్రభావత్, ఓబుల్స్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, ఏఆర్డిఎస్ ఎన్జీవోస్ నాయకులు దొర బాబు, మండల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.