Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఉస్మానియా ఆస్పత్రికి కార్డియాలజీ ఆధునిక పరికరం సమకూర్చుకున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర కోవిద్ రెస్పాన్స్ ప్లాన్‌లో భాగంగా సరికొత్త పరికరాన్ని కార్డియాలజీ విభాగానికి రోగుల అత్యవసర పరిస్థితుల్లో ప్రధానమన్నారు. దీంతో కార్డియాలజీ విభాగం నుంచి మరింత నాణ్యమైన సేవలు అవసరమైన పేద రోగులకు అందించవచ్చునని వివరించారు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఎన్నో దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు అమూల్యమైన సేవలు వినియోగించు కోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్డియాలజీ విభాగం విభాగాధిపతి డాక్టర్ ఇమాముద్దీన్కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి త్రివేణి, ఆర్ఎంఓ- 1 డాక్టర్ .బి .శేషాద్రి, అడ్మినిస్ట్రేటివ్ టీంకి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.