Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
'జీవ నది' సంపుటిలోని కథలన్నీ వాస్తవ జీవిత చిత్రణేనని ప్రముఖ చారిత్రక నవలా రచయిత ఆచార్య ముదిగొండ శివ ప్రసాద్ అన్నారు. శ్రీత్యాగరాయ గాన సభలోని కళా సుబ్బారావు కళా వేదికపై జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండషన్ నిర్వహణలో జన్నాభట్ల నరసింహ ప్రసాద్ రచించిన జీవ నది కథా సంపుటి అవిష్కరణ సభ జరిగింది. కథల్లో కల్పనలు లేవని సహజ జీవ నది లా కధ సాగి పోతూ మనలో ఆలోచన రేకెత్తిస్తుందని వివరించారు. సాహితీ కిరణం సంపాదకులు పొత్తూరి సబ్భారావు అధ్యక్శత వహించిన సభలో రచయిత లాంఛనంగా తన సంపుటి గుదిబండి వెంకట రెడ్డికి, వీవీ.రాఘవ రెడ్డికి అంకిత మిచ్చారు. నేటి నిజం పత్రిక సంపాదకులు బైస దేవ దాసు, కవి పెద్దూరి వెంకట దాసు పాల్గొన్నారు. లక్ష్మి కామేశ్వరి పాడిన దేశ భక్తి గీతాలు అక్షటుకొన్నాయి.