Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ డాక్టర్ పిడమర్తి రవి శోభాయాత్ర కరపత్రాలు ఆవిష్కరణ
నవతెలంగాణ-ఓయూ
ఏప్రిల్ 14న జరిగే బ్లూ షర్ట్స్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ శోభయాత్రను జయప్రదం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ డాక్టర్ పిడమర్తి రవి, రాపోలు రాములు, ఇటుక రాజు పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్క్ నుంచి ట్యాంక్‌బండ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించనున్న శోభయాత్ర కరపత్రాలను మంగళవారం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట విడుదల చేశారు. ఏప్రిల్ 14న 'డిమాండ్స్ డే'గా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. బీసీలకు 50 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 20శాతం, మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే డిమాండ్‌తో శోభయాత్ర కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జ్ఞాన ప్రచార సభ అధ్యక్షులు నల్లబాబు, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గాదె వెంకట్, ఓయూ అధ్యక్షులు బోరెల్లి సురేష్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్, కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి అధ్యక్షులు జేరిపోతుల పరుశురాం, చెంచల్ నర్సింగరావు, జేఏసీ నాయకులు వడ్డే ఎల్లన్న, రామగళ్ల సుందర్, వేల్పుగొండ వెంకటేష్, ఎర్రవల్లి కష్ణ, టీడీడీ నాయకులు మొగులయ్య, మాల మహానాడు అధ్యక్షులు పబ్బతి శ్రీకష్ణ, ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకినీ రాజు, జెర్రిపోతుల సాయి, దేవరకొండ నరేష్, ఇటుక గోపి, సైదులు, జోగు గణేష్, ధనరాజ్, బండారు శేఖర్, వేల్పు కొండ రామకష్ణ, దర్శిని పాల్గొన్నారు.