Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
దేశవ్యాప్త రెండు రోజుల సార్వత్రిక సమ్మెలో భాగంగా చలో కలెక్టరేట్ కార్యక్రమానికి సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రగతి నగర్, నిజాంపేట్, బాచుపల్లి ప్రాంతాల నుంచి తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎం చంద్రశేఖర్, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నిజాంపేట కార్పొరేషన్ ఉపాధ్యక్షులు పి. పెంటయ్య, కార్యదర్శి ఎన్. ఎల్లమ్మ , అంగన్వాడీ బాచుపల్లి సెక్టార్ కన్వీనర్ సోనీ మాట్లాడుతూ దేశవ్యాప్త రెండో రోజు సమ్మె సంపూర్ణంగా జయప్రదం అయిందన్నారు. కేసీఆర్ వాగ్దానం చేసిన విధంగా కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26 వేల రూపాయలుగా నిర్ణయించాలని కోరారు. దేశ ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటీకరించవద్దని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా ముగిసిన అనంతరం సీఐటీయూ జిల్లా అధ్యక్షులు అశోక్ ఉపాధ్యక్షులు ఎం చంద్రశేఖర్ మున్సిపల్ యూనియన్ నాయకులు ఎల్లమ్మ భాగ్యమ్మ పి. పెంటయ్య నరసింహ బందం, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్మికులకు జీహెచ్ఎంసీ కార్మికుల వేతనాలను అమలు చేయాలని, అర్హులైన మున్సిపల్ కార్మికులు అందరికీ డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని, కార్మికుల పై అధికారుల వేధింపులు ఏ విధంగా చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎన్. బాలు, బాచుపల్లి సీఐటీయూ మండల నాయకులు పి.స్వామి, నరసింహ వెంకన్న నాగ శేషు లక్ష్మి దుర్గయ్య నర్సమ్మ పుష్ప కమల మనీ తదితరులు పాల్గొన్నారు.