Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సేవ్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ సింగారం సుధాకర్
నవతెలంగాణ-బోడుప్పల్
నేడు అడుగంటిపోతున్న భూగర్భ జలాలను వడిసిపట్టేలా ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేయాలని, సేవ్ వాటర్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ సింగారం సుధాకర్ అన్నారు. సోమవారం నాడు ప్రపంచ నీటి పొదుపు వారోత్సవాల్లో భాగంగా పర్వతాపూర్లోని అరోరా టెక్నలాజికల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కాలేజీలో కళాశాల నేచర్ క్లబ్ మరియు సేవ్ వాటర్ ఫౌండేషన్, బోడుప్పల్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థుల చేత జల ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సేవ్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ సింగారం సుధాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకొని భావితరాలకు అందించాలని, అలాగే నీటి పొదుపు గురించి ప్రతి ఒక్కరికీి వివరించాలని తెలిపారు. మరియు మీకు తెలిసిన వారి చేత నీటి ప్రతిజ్ఞ చేయించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల డైరెక్టర్ శ్రీకాంత్ జట్ల మాట్లాడుతూ భూగర్భ జలాలు అంతరించిపోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని మరియు భూగర్భజలాలు తగ్గితే సంభవించే నష్టాల గురించి శాస్త్రీయ అవగాహన ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ విభాగ అధిపతి డాక్టర్ అజరు కుమార్, కళాశాల అధ్యాపక సిబ్బంది, నేచర్ క్లబ్ కోఆర్డినేటర్ గీత పార్తిబాన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.